టీటీవి నేత దిన‌క‌ర‌న్ అనుచ‌రుడి వ‌ద్ద ప‌ట్టుప‌డ్డ రూ.1.48 కోట్లు

అమ‌రావ‌తిః ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి బుధ‌వారం ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు రూ.1.48 కోట్లు టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మునేట్ర కజగం (AMMK) నేత నిర్వహిస్తున్నదుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది.త‌మిళ‌నాడులో తేని జిల్లా ఆండిపట్టిలో ఈసీ, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు.వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్‌ పెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే సోదాలు మొదలు పెట్టారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు AMMK కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు.ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY