రాహుల్ గాంధీ-చంద్రబాబుల ఆప్యాయ ప‌ల‌క‌రింపులు-భ‌విష్య‌త్ కోస‌మేనా ?

0
165

అమ‌రావతిః కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా వేదికపై సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, చంద్రబాబు,మమతా బెనర్జీ,మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు. ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి,షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి,అభినందించారు.కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు.ఎప్పుడూ ఉప్పు,నిప్పులా ఉండే కాంగ్రెస్,టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం,మాట్లాడుకోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు ఏవిధంగా ఆర్దం చేసుకుంటారో వేచిచూడాల్సి వుంది ?
చంద్ర‌బాబు చీకటి ఒప్పందాలుః– బెంగళూరు విధానసౌధ వేదికగా కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయని,చంద్రబాబు చేసిన ఈ పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ రహస్యంగా సాగిన చీకటి ఒప్పందాలు బహిర్గతమయ్యాయని, రాష్ట్ర ప్రజల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టడం తగదని, ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్శిటీ మంజూరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని చెప్పారు.
—————————————————–

LEAVE A REPLY