ఢిల్లీ-మీరట్ మధ్య రీజనల్ రాపిడ్ ట్రాన్స్ సీట్ సిస్టమ్ ప్రారంభించి ప్రధాని మోదీ
అమరావతి: ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌లో సాహిబాబాద్,, న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు..అదివారం ప్రధాని మోదీ ఉదయం 11.30 గంటలకు హిండన్ ఎయిర్‌బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకుని,,సాహిబాబాద్ (రీజనల్ రాపిడ్ ట్రాన్స్ సీట్ సిస్టమ్ ) RRTS స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధాని ప్రయాణించారు.. రైలులో ప్రయాణించిన సమయంలో అందులో ఉన్న పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని నరేంద్ర మోదీ,,విద్యార్దుల చదువుల గురించి అడిగి తెలుసకున్నారు..ఈ లైన్ ప్రారంభం కావడంతో మీరట్ సిటీ నమో భారత్ ట్రైయిన్ ద్వారా నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానించడంతో ప్రయాణ సమయం తగ్గుతుంది.. ప్రయాణికులు న్యూ అశోక్ నగర్ నుంచి మీరట్ సౌత్‌కు కేవలం 40 నిమిషాల్లో ప్రయాణించవచ్చు..
రెండు నగరాల మధ్య దూరంను కేవలం రూ.150తో ప్రయాణించగలరు.. జనవరి 5 సాయంత్రం 5 గంటల నుంచి నమో భారత్ రైళ్లు 15 నిమిషాల ఫ్రీక్వెన్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి.. న్యూ అశోక్ నగర్ స్టేషన్ నుంచి మీరట్ సౌత్‌కు స్టాండర్డ్ కోచ్‌కు రూ.150,, ప్రీమియం కోచ్‌కు రూ.225గా నిర్ణయించారు..సాహిబాబాద్ RRTS స్టేషన్, న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ మధ్య నమో భారత్ రైలులో ప్రధాని మోదీ ప్రయాణించారు. మొత్తం 11 స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 9 స్టేషన్లతో కూడిన సాహిబాబాద్, మీరట్ సౌత్ మధ్య 42 కి.మీ కారిడార్ పనిచేస్తోంది. ఈ ప్రారంభోత్సవంతో నమో భారత్ కారిడార్‌లో మొత్తం 11 స్టేషన్‌లతో నిర్వహించే విభాగం 55 కిలోమీటర్లకు పెరిగింది. అదివారం ప్రారంభమైన ఈ కొత్త లైన్ లో 13 కి.మీల దూరంలో 6 కి.మీ భూగర్భంలో ఉంటుంది.