కాశ్మీర్‌లో ఉగ్రవాదుల‌ ఏరివేతకు NSG టీమ్స్‌

0
80

అమ‌రావ‌తిః ఇటీవ‌ల కాలంలో పేట్రేగిపోయిన కాశ్మీర్‌లో ఉగ్రవాదుల‌ను ఏరివేసేందుకు గ‌వ‌ర్న‌ర్‌గా బాద్య‌తలు చేప‌ట్టిన ఎన్‌.ఎన్ వోహ్ర‌,ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు.శ్రీనగర్‌కు సమీపంలోని హుమ్ హానా బీఎస్ఎఫ్ క్యాంపునకు అత్యాధునిక ఆయుధాలతో కూడిన NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) దళం చేరుకుంది. 2 కిలోమీటర్ల దూరం వరకూ గురి తప్పకుండా బులెట్లను కాల్చే స్నిప్పర్ లు, తుపాకులు,ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేరాడార్స్‌తో కాశ్మీర్‌కు చేరుకున్నారు.కేంద్ర హోమ్ శాఖ ఆదేశాల మేరకు బ్లాక్ యూనిఫాం ధరించిన కమాండోలు శ్రీనగర్ రహదారులపై కవాతు నిర్వహించారు. NSG HIT (హౌస్ ఇంటర్వెన్షన్ టీమ్స్) కమాండో టీమ్ నుంచి గురి చూసి కాల్చే రెండు డజన్ల స్నిప్పర్స్ వచ్చారని, వీరంతా రెండు వారాల క్రితమే తమ శిక్షణను ముగించుకున్నారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ స్టేషన్ కు 100 మంది కమాండోలు వచ్చారని,వీరంతా యాంటీ హైజాక్ డ్రిల్స్,ఉగ్రవాదుల ఏరివేతలో నిష్ణాతులని తెలిపారు.రంజాన్ మాసం సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణను పండగ తరువాత ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా,ఆపై బీజేపీ మద్దతు ఉపసంహరణతో రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం గద్దె దిగడం,గవర్నర్ పాలన ప్రారంభం అయిన త‌రువాత ఉగ్ర‌మూక‌ల‌ను ఏరివేత కార్యాక్ర‌మం ముమ్మ‌రం అయింది.

LEAVE A REPLY