శ‌బ‌రిమ‌ల వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న 2 వేల మంది ఆరెస్ట్‌

0
115

అమ‌రావ‌తిః సుప్రీమ్‌కోర్టు అమల‌ను అడ్డ‌కుంటు,అందోళ‌న చేస్తున్న‌వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులతో హైలెవెల్ మీటింగ్ జరిగింది.ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.2,300 మందిపై 452 కేసులు నమోదయ్యాయి. డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా మాట్లాడుతూ, అరెస్టులు కొనసాగుతాయని చెప్పారు.సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా ఆందోళనకు దిగిన వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 గంటల వ్యవధిలోనే 2 వేల మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 700లకు పైగా ఆందోళనకారులు పత్తనంతిట్ట, తిరువనంతపురం,కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాలకు చెందినవారని డీజేపీ తెలిపారు.నవంబర్ 12 నుంచి రెండు నెలల పాటు శబరిమల బిజీగా ఉంటుందని, ఇప్పుడు జరిగిన విధంగా అప్పుడు ఆందోళనలు జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.మరోవైపు అరెస్టయిన వారిలో 1500 మంది బెయిల్ పై బయటకు వచ్చారు. జైళ్లు కిక్కిరిసి ఉండటంతోనే వీరికి బెయిల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY