లిక‌ర్ కింగ్ విజ‌య్‌మాల్యా రూ.13 వేల కోట్లు చెల్లిస్తా-కేంద్ర ప్ర‌భుత్వం విజ‌యం

0
84

అమ‌రావ‌తిః లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాపై భారత ప్రభుత్వం ఒకదాని త‌రువాత మ‌రో కేసులు పెడుతు,చ‌ట్ట‌ప‌రంగా లండ‌న్ కోర్టుల్లో మాల్య‌ను ప‌రుగులు పెట్టించ‌డంతో,ఎట్టకేలకు బ్యాంకులకు బకాయి పడిన రుణాలన్నింటిన్నీ చెల్లించడానికి అంగీకరించాడు.ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నరుణాలను సెటిల్‌ చేయడానికి తాను ప్రయత్నాలన్నింటిన్నీ కొనసాగిస్తానని మాల్యా చెప్పారు.ఇదే విషయంపై 2016లోనే మాల్యా, ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను కూడా ప్రస్తుతం ఆయన ప్రస్తావించారు.ఆ లేఖలో బ్యాంకుల రుణాలను సెటిల్‌ చేసుకోవడానికి మాల్యా అంగీకరించారు.అయితే కన్సార్టియం ఆఫ్‌ బ్యాంకుల విషయంలోనే బోగస్‌ ఉన్నాయని ఆరోపించారు.బకాయిలు చెల్లించడంతోపాటు తాను భారత్‌కు వచ్చేస్తానని మాల్యా చెప్పడం గమ‌నించ‌త‌గ్గ ఆంశం.విజ‌య్‌మాల్యా చేసిన తాజా ప్రకటనలో కూడా బ్యాంకులకు బకాయిపడిన రూ.13 వేల కోట్ల మేర రుణాలను తాను చెల్లించడానికి ఒప్పుకుంటున్నట్టు తెలిపారు. మాల్యాను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో అయ‌న‌ ఈ ప్రకటన చేశారు.తన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.అతన్నిభారత్‌కు అప్పగించే వ్యవహారంపై లండన్‌ కోర్టులో విచారణ కూడా జరుగుతోంది.ఎట్టకేలకు అప్పులు చెల్లించడంతోపాటు భారత్‌కు వస్తానని మాల్యా చెప్పడంతో అప్పులిచ్చిన బ్యాంకులు ఊపిరిపీల్చుకుంటున్నాయి.

LEAVE A REPLY