గ్యాంగ్‌స్టర్ చోటారాజన్‌కు కోర్టు జీవిత ఖైదు

0
21

అమ‌రావ‌తిః గ్యాంగ్‌స్టర్ చోటారాజన్‌కు కోర్టు జీవిత ఖైదును విధించింది. జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే మిడ్‌డే హత్య కేసులో చోటారాజన్‌తో పాటు మరో ఏడుగురు దోషులుగా తేలారు.మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం యాక్ట్ కోర్టు వీరందరికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పును వెలువరించింది. ఏడేళ్ల కిందటి ఈ హత్య కేసులో ఇవాళ ఓ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ జర్నలిస్ట్ జిగ్నా వోరాను నిర్దోషిగా తేల్చింది.జ్యోతిర్మయ్ డే మిడ్‌డే ఈవెనింగర్‌లో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేసేవారు. జూన్ 2011లో ఆయన ఇంటి దగ్గరే దుండగులు కాల్చి చంపారు.చోటా రాజన్ ఆదేశాల మేరకే ఆయనను కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. చింది-రాగ్స్ టు రిచెస్ పేరుతో తాను రాయబోయే పుస్తకంలో చోటా రాజన్ గురించి కూడా ప్రస్తావించడం గ్యాంగ్‌స్టర్‌కు ఆగ్రహం తెప్పించింది. 20 మంది గ్యాంగ్‌స్టర్ల జీవితచరిత్రలను ఈ పుస్తకంలో జ్యోతిర్మయ్ డే వివరించారు.దీంతో ఆయనను చంపడానికి చోటా రాజన్ ఓ వ్యక్తికి రూ.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే ఈ కేసులో అప్పటి ది ఏషియన్ ఏజ్ పత్రిక డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా ఉన్న జిగ్నా వోరాను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. చోటారాజన్‌తో చేతులు కలిపి జ్యోతిర్మయ్ డేను చంపడానికి జిగ్నా ప్లాన్ చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ హత్యతో అతనికి సంబంధం లేదని కోర్టు తేల్చింది. చోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు.

LEAVE A REPLY