లంబార్గిని హరికేన్‌ ఎవో ధ‌ర‌ .3.73 కోట్లు-భార‌త్‌లో విడుద‌ల‌

0
107

అమ‌రావ‌తిః భార‌త‌దేశంలో ల‌గ్జ‌రీ కార్లును కొనేవారి సంఖ్య ఇటీవ‌ల కాలం బాగా పెరుగుతుంది అనేందుకు నిద‌ర్శ‌నం,, ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబార్గిని అతి ఖరీదైన కారును భారతీయ మార్కెట్లో గురువారం లాంచ్‌ చేసింది. హరికేన్‌ ఎవో పేరుతో లాంచ్‌ చేసిన ఈ కారుకు రూ .3.73 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది.2018 ఏడాదికి సూపర్‌ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో భారత్‌ తామే లీడర్స్‌గా ఉన్నామనీ, ఈ సంవ‌త్సరంలో తమ స్థానాన్నిమరింత పటిష్టపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లంబార్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ వెల్లడించారు.
కార్ సాంకేతిక వివ‌రాలుః- 5.2 లీటర్ ఇంజిన్, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్ గరిష్ట టార్క్ 640, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్,రియర్ వీల్ డ్రైవ్ సిస్టం,రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ ఫీచర్లతోపాటు కొత్తగా అడ్వాన్స్‌డ్‌ న్యూ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టంను జోడించింది.2017లో 26 యూనిట్లు విక్రయించగా,2018లో 45 యూనిట్లు విక్రయించిన‌ట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లంబోర్గిని 2018లో సంవత్సరం 5,750 యూనిట్లు విక్రయించిందని,ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2017లో 1,000 యూనిట్ల నుంచి 1,301 యూనిట్లను అమ్మిన‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY