కేర‌ళ‌లో మ‌ళ్లీ విజృభిస్తున్న‌నిప్పా వైర‌స్‌

అమరావ‌తిః గ‌త సంవ‌త్స‌రం మే నెల‌లో కేర‌ళ రాష్ట్రన్ని వ‌ణికించిన నిప్పా వైరస్ మ‌ళ్లీ తిరిగి ఇదే నెల‌లో కేరళలోని ఎర్నాకుళంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య‌శాఖ మంత్రి కె.కె.శైల‌జ్ మంగళవారం ధ్రువీకరించారు.ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి ఇడుక్కిలోని తోడుపుళాలోని కాలేజీలో చదువుతున్నాడు. ఇటీవల ఓ క్యాంప్‌ నిమిత్తం త్రిశూర్‌ వెళ్లి నాలుగు రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలోనే అతడికి జ్వరం వచ్చింది. క్యాంప్‌ నుంచి తిరిగొచ్చాక కూడా జ్వరం తగ్గకపోవడంతో తాజాగా కోచిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. 10 రోజుల క్రింద‌ట లక్షణాలు Nipah virusలాగా ఉండటంతో అనుమానించిన వైద్యులు అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ (NIV)కి పంపారు.ఆ నమూనాలను పరిశీలించిన ఎన్‌ఐవీ.. నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించి,ఫ‌లితాల‌ను కేరళ ప్రభుత్వంకు తెలిపింది.దింతో అప్రమత్తమైన కేర‌ళ‌ప్ర‌భుత్వం చర్యలు చేపట్టిన ఆసుపత్రి సిబ్బంది వీరిని ప్రత్యేక వార్డులో ఉంచారు.అలాగే ఈ మధ్య కాలంలో విద్యార్థితో పాటే ఉన్న 86 మందిని అబ్జర్వేషన్‌లో పెట్టారు.దీనిపై ప్రజలు కంగారు పడాల్సింది ఏమీ లేదని,నిఫా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎర్నాకుళం, త్రిశూర్‌, కోజికోడ్‌ జిల్లాలో నిఫాపై అలర్ట్‌ ప్రకటించామని,రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.గతేడాది మే నెలలో కేరళలో నిఫా వైరస్‌ కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నిఫా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.ఆ తర్వాత రోగికి దగ్గరగా ఉండేవారికి,అలా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్‌ వల్ల తొలి దశలో తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి కలుగుతుంది.అటు త‌రువాత రోగి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తి ప్రాణ‌పాయ స్థితికి చేరుకుంటారు.