సీనియ‌ర్ అధికారుల బ‌ద‌లీలు ప్రారంభించిన యడ్యూర‌ప్ప‌

0
17

అమ‌రావ‌తిః కర్ణాటక సి.ఎంగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వేంట‌నే సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ప్రారంభించారు. గ‌త ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులను ముఖ్యమంత్రి బదిలీ చేస్తున్నారని సమాచారం.బీదర్ జిల్లా ఎస్పీ దేవరాజ్‌ను బెంగళూరు నగర సెంట్రల్ డీసీపీగా బదిలీ చేశారు.అమర్ కుమార్ పాండేని ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా,సందీప్ పాటిల్‌ను ఇంటెలిజెన్స్ డీఐజీగా బదిలీ చేశారు. బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీగా ఎస్.గిరీష్‌ను బదిలీ చేశారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినంత‌రం తొలి సంత‌కం రైతురుణ‌మాఫీఫైల్‌పై పెట్టారు.రైతుల రుణమాఫి పై అధికారులతో చర్చలు పూర్తి అయిన తరువాత ఐపీఎస్ అధికారుల బదిలీల కార్య‌క్ర‌మం ప్రారంబించారు.

LEAVE A REPLY