భారీ వ‌ర్షాల‌తో కేర‌ళ‌లో భీభ‌త్సం-26 మంది మృతి

0
207

అమ‌రావతిః భారీ వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రంలో తీవ్ర ప‌రిస్దితులు నెల‌కొన్నాయి.భారీ వ‌ర్షాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 26 మంది మృతి చెందిన‌ట్లు ప్ర‌భుత్వం ప్రాథ‌మిక అంచ‌న వేసింది. ఒక వ‌ర్షం దినికి తోడు కొండ‌చ‌రియాలు విరిగిప‌డుతుంగా,మ‌రో ప‌క్క ఎక్క‌డ రోడ్డో,ఎక్క‌డ కాలువ‌లో ఆర్ధంకాని దారుణ ప‌రిస్దితులు చోటు చేసుకోవ‌డంతో,ప‌డ‌వ‌ల‌పైనే బాధితుల‌కు స‌హాయం అందించేందుకు ఎన్డీఎఫ్ బృందాలు మ‌మ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.వ‌ర్షం మూలంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్పాడుతుంది.ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.కేర‌ళ‌కు 5 కోట్ల రూపాయ‌ల స‌హాయం ప్ర‌క‌టించిన త‌మిళ‌నాడు సి.ఎం ప‌ళ‌నిస్వామి,ప్ర‌భుత్వ ప‌ర‌మైన స‌హాయంకు సిద్దంగా వున్న‌మ‌ని ప్ర‌క‌టించారు.కావేరి ప‌రివ‌హాక ప్రాంతాలై 6 జిల్లాల‌కు వ‌ర‌ద ముప్పు,ముందుస్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని,మ‌రిన్ని స‌హాయ‌క బృందాలు పంప‌నున్న‌ట్లు కేంద్రం తెలిపింది.

LEAVE A REPLY