భారత రాజకీయాలపై అద్వానీ అంతులేని ప్రభావాన్నిచూపారు-మోదీ

0
91

అమ‌రావ‌తిః త‌న రాజ‌కీయ గురువు,, బీజేపీ అగ్రనేత అద్వానీ 91వ పుట్టినరోజు సందర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అద్వానీకి మోదీ ఓ పుష్పాన్ని బహూకరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.ఈ విషయంపై మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘అద్వానీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలో ఆయన కృషి వెలకట్టలేనిది.ఒక మంత్రిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. ప్రజా సంక్షేమమే ఆయనకు పరమావధి.భారత రాజకీయాలపై అద్వానీ అంతులేని ప్రభావాన్నిచూపారు.ఏ మాత్రం స్వాలాభాపేక్ష లేకుండా బీజేపీని ఆయన నిర్మించిన విధానం,కార్యకర్తలను ప్రభావితం చేసిన తీరు అసాధారణం’ అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY