ప‌వ‌న్‌,మాయ‌వ‌తిలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌సి పోటీ చేస్తే ?

అమ‌రావ‌తిః రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రలోని అధికార‌,ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌ల రాత‌ను మార్చేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రి ఉహాల‌కు అంద‌కుండా పావులు క‌దుపుతున్న‌ట్లు అయ‌న క‌న్పిస్తుంది. ప‌వన్ బుధ‌వారం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు.బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ కోసం పవన్ లక్నోకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.ఈ మధ్య కాలంలో తన పక్కన పెట్టుకొని తిప్పుతున్న నాదెండ్ల మనోహన్‌ను ఆయన వెంట పెట్టుకెళ్లారు.వారిద్దరితో పాటు పలువురు జనసేన ప్రతినిధులు,ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు,విద్యా వేత్తలు సైతం లక్నోకు వెళ్లారు.రానున్నసార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తున్నతరుణంలో ఆమెతో పవన్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళలో,జాతీయ నాయకులతో టచ్‌లో ఉండటంతో పాటు,అవసరానికి తగ్గట్లుగా కూటమిలో చేరేందుకు వీలుగా పవన్ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. మాయవతి భేటీలో పవన్ ఏయే అంశాలు చర్చించనున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బీస్పికి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేక‌పోయిన ద‌ళిత వ‌ర్గాల్లో చీలిక రావ‌డం ఖాయంగా క‌న్పిస్తుంది.ఒక వేళ ప‌వ‌న్‌,మాయ‌వ‌తిలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌సి పోటీ చేస్తే ? 3 శాతం ఓట్లు చీలిన ? ప‌రిస్దితులు ఎలా వుండ‌బోతున్న‌య‌నేది వేచిచూడాల్సిందే ?