జమ్ముకశ్మీర్‌లో మరోసారి రాష్ట్రపతి పాలన ?

0
71

అమ‌రావ‌తిః సంకీర్ణప్ర‌భుత్వం నుండి బిజెపి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేసినట్టు స‌మాచారం.కొంత సేపు క్రింద‌ట‌ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (PDP)కి మ‌ద్దతు ఉప‌సంహ‌రించ‌డంతో ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది.మరోవైపు పీడీపీ అధికార ప్రతినిధి రఫి అహ్మద్ మీర్ మాట్లాడుతూ, బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నించామని,అది జరగలేదని చెప్పారు.బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని ఊహించలేకపోయామని అన్నారు.కాసేపట్లో ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించబోతున్నారని పీడీపీ మంత్రి నయీమ్ అఖ్తర్ తెలిపారు.జమ్ముకశ్మీర్ మరోసారి రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లాః-జమ్ము కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించాలని ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా మంగళవారం డిమాండ్ చేశారు. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగానే ఒమర్ గవర్నర్‌ను కలిశారు. దీంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు సాగుతున్నారా? లేక బీజేపీయేతర పార్టీలు ఒక్కటవుతున్నాయా? అనే చర్చ సాగింది.పొత్తు వీగిపోవడంపై తామేం సంబరాలు చేసుకోవడం లేదన్నారు.శాంతిభద్రతల విషయంలో పీడీపీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి అంతే బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా అన్నది గవర్నర్ ఇష్టమని చెప్పారు.జమ్ము కాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.పార్టీల బలాల విషయానికి వస్తే పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15,కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు ఉన్నాయి.ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు.

LEAVE A REPLY