పెను తుఫాన్‌గా మారిని ఫొని-రేపు భారీ విధ్వ‌సం జ‌రిగే ఆవ‌కాశం

200 కిమీ వేగంతో గాలులువిశాఖ‌ప‌ట్నంః ఫోని తుఫాన్ క్ర‌మంగా పెనుతుఫాన్‌గా మారింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 175 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రాకృమై ఉంది.ద‌క్షిణ ఒడిశా వైపు పెనుతుపాను దూసుకెళ్తోంది.ఈ ప్రభావంతో శ్రీకాకుళం తీర‌ప్రాంత మండ‌లాల్లో కుంభ‌వృష్టి కురిసే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.దింతో శ్రీకాకుళం,విజయనగరం తీర ప్రాంత మండలాల్లో తుపాన్ న‌ష్ట‌న్ని దృష్టిలో వుంచుకుని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.ప్రస్తుతం ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 – 140 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయి.ఒడిశా ప్ర‌భుత్వం ఇప్పటికే 8 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.ఉత్త‌రంధ్ర‌మీదుగా న‌డిచే ప‌లు రైళ్లు,విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు.శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో ఒడిశాలోని పూరీ గోపాల్‌పుర్‌,చాన్‌బాలి వ‌ద్ద‌ తీరం దాటే ఆవ‌కాశం ఉండ‌డంతో,గురువారం రాత్రి 8 గంట‌ల నుండి శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు రోడ్డు మార్గంను మూసివేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు.మరోవైపు.. సహాయ చర్యలకు భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉంది. రిలీఫ్ మెటీరియల్, వైద్య సహాయ బృందాలతో ఒడిశా తీరానికి సహ్యాద్రి, కథ్మత్, రణ్ వీర్ యుద్ధ నౌకలు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో వైద్య బృందాలు, డైవింగ్‌ సిబ్బంది ఒడిశా బయలుదేరాయి.