లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆధారలు వున్నాయా-సుప్రీమ్
అక్టోబర్ 3వ తేదీకి వాయిదా..
అమరావతి: మతాన్ని, రాజకీయాలను ఒకటి చేయవద్దు,,దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యనించింది..తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు..ఈ పిటిషన్లపై సోమవారం బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్లపై వాదనలు చేపట్టింది..రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు..లడ్డూలో నాణ్యత లోపం ఉందని భక్తులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను పరిశీలించి టెస్టింగ్‌కు పంపించారని వివరించారు..అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా కల్తీ జరిగిందని గుర్తించారని తెలిపారు.. స్పందించిన ధర్మాసనం ఏదైనా అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు..నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత, తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది..దాదాపు గంటపాటు సాగిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది..గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది..గత రెండు రోజుల నుంచి సిట్ వేగంగా దర్యాప్తు చేస్తొంది.