పోలవరం పనులపై వెంటనే విచారణ జరపండి-ఢిల్లీ హైకోర్టు

పెంటపాటి.పుల్లారావు పిటిషన్అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందంటూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా,కోర్టు నేడు విచారించింది.ఈ పిటిషన్ లో  ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని అయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.నామినేషన్ విధానంలో వేల కోట్ల రూపాయల పనులను అప్పగిస్తున్నారని ఆరోపించారు.పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేస్తు,, పిటిషన్ ను ఫిర్యాదుగా భావించి తక్షణమే విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై పెంటపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేస్తు, కోర్టు ఆదేశాలతో పోలవరం పనుల్లో చోటు చేసుకున్న అవినీతి బయటపడుతుందన్నారు.గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులే, కొత్త ప్రభుత్వంలో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారని చెప్పారు.పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం,ఇదే విషయంపై ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.మార్చిలో ఎన్నికల ప్రచారానికి గుంటూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన విషయాన్ని పుల్లారావు గుర్తు చేశారు.సాక్షాత్తూ ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా కూడా ఇంతవరకు దానిపై విచారణ జరగలేదన్నారు. పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50వేల వంతున ఇచ్చేసి, ఆ భూములను కొందరు కొన్నారని,వారికి ఎకరాకు రూ.40 లక్షల వరకు ఇచ్చేందుకే ప్రాజెక్టు అంచనాలను పెంచారని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు.

LEAVE A REPLY