భారతదేశంలో తొలిసారిగా (Basket Ball) NBA టోర్నమెంట్‌

అమరావతి: భారతదేశంలో తొలిసారి జరగబోయే (Basket Ball) NBA టోర్నమెంట్‌లో రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక గౌరవాన్ని అందుకోనున్నారు.అక్టోబర్ 4,5న Indiana Pacers vs Sacramento Kings మధ్య జరిగే మ్యాచ్‌కు NBA అధికారులకు ప్రారంభోత్సవ నీతా అంబానీ ‘మ్యాచ్‌ బాల్’ను అందించనున్నారు.తొలిసారిగా NBA ను భారతదేశానికి అధికారికంగా ఆహ్వానిస్తూ ప్రారంభించానున్నారు. ప్రీసీజన్ గేమ్స్ కోసం భారతదేశంలో NBA నిర్వహిస్తున్న సందర్భంగా ఈ లీగ్‌తో ఉన్న ఆరేళ్ల అనుభవాన్ని ‘రిలయెన్స్ ఫౌండేషన్ జూనియర్ ప్రోగ్రామ్’ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటోంది రిలయెన్స్ ఫౌండేషన్‌. ఇండియాలో NBA ప్రారంభోత్సవం సందర్భంగా జూనియర్ NBA ప్రోగ్రామ్‌లోని చిన్నారుల్ని స్టేడియంకు తీసుకొస్తోంది రిలయెన్స్ ఫౌండేషన్. అక్టోబర్ 4న ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా-NSCI వేదికగా జరిగే తొలి NBA గేమ్‌ను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం చిన్నారులకు లభిస్తుంది. 20 రాష్ట్రాల్లోని 34 పట్టణాలకు చెందిన 1.1 కోట్ల మంది పిల్లలకు ఈ గేమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ NBA ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకోవడం మరో విశేషం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బాస్కెట్ బాల్‌ను చేర్చడం ద్వారా యువత ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.

LEAVE A REPLY