అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎదురుదెబ్బ‌

0
116

అమరావ‌తిః అమెరికాలో జ‌రిగిన‌ మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి పట్టం కట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటివరకూ ప్రతినిధుల సభలో ఆధిక్యం చలాయించిన రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితమయ్యారు. అయితే ఎగువ సభ సెనెట్ లో మాత్రం రిపబ్లికన్లు తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. అక్కడ ఎన్నికలు జరిగిన 35 సీట్లలో 26 స్థానాలను రిపబ్లికన్ పార్టీ ఖాతాలో వేసుకుంది.ఈ ఎన్నిక‌లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు.తాజా ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమొక్రాట్ల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లడం ట్రంప్ కు సాధ్యంకాదని వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY