విచారణ పూర్తి కాకుండానే ఇళ్లను కూల్చడం సరికాదు-సుప్రీంకోర్టు
అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇంటిని కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది..నేరాలకు పాల్పడిన వారిపై బుల్డోజర్ చర్యలు చేపడుతున్న చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును ఇచ్చింది.. ఇళ్లను కూల్చడం సరికాదని,,ఇది నివసించే హక్కును కాలరాసినట్లు అవుతుందని అభిప్రాయపడింది.. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేం పేర్కొంది..అలాంటి వ్యక్తుల ఇళ్లను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది..చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే, ఆ కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత సుప్రీం కోర్టు స్పష్టం చేసింది..కోర్టులు ఇచ్చిన అదేశాలతో,,ప్రభుత్వ,,ఇతరుల స్థలాలను ఆక్రమించిన వారికి ఈ అదేశాలు వర్తించవని తెలిపింది.