అమితాబ్ బచ్చన్ ను వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

అమరావతి: భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అయిన అమితాబ్ బచ్చన్ ను ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది.రెండు తరాల ప్రజలను  తన నటనతో అలారిస్తున్నఅమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ ట్విట్టర్ లో వెల్లడించారు.యావత్ భారతావనికే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా సంతోషపడే విషయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.