చైనాలో ఆన్య‌మ‌త‌స్దుల‌పై ఆంక్షలు-దేశం వ‌దిలిపోతున్నపాస్ట‌ర్లు

0
198

అమ‌రావ‌తిః మ‌త ప‌ర‌మైన స్వేచ్చ‌పై చైనా అధ్య‌క్ష‌డు జిన్‌పింగ్ కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తు,విదేశీ మతాలపై విరుచుకుపడుతున్నట్లు స‌మాచారం.దీంతో చైనాలో అన్య మతస్థులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతు,రహస్యంగా మత ప్రార్ధనలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.మావో జెడాంగ్ తర్వాత అంతటి బలమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్‌పింగ్ దేశంలో ఇతర మతాలను లేకుండా చేయాలని కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.మత స్వేచ్ఛ పేరుతో విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రించేవారికి కళ్ళెం వేసి,దేశాన్ని చైనీయం చేయాలన్న లక్ష్యంతో ముందుకుపోతున్నారు.ఇప్పటికే చైనాలో జిన్‌పింగ్ ప్రభుత్వం వీఘర్ ముస్లింలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది.ఇప్పుడు క్రైస్తవులపై ప‌ట్ల క‌ఠిన నిర్ణ‌యాలు ఆమలు చేస్తున్నారు.చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో క్రైస్తవులు అధికంగా ఉండ‌డంతో,అక్కడ ఉన్న క్రైస్తవులపై ఉక్కుపాదం మోపుతున్నారు.జిన్‌పింగ్ దెబ్బకు చైనానుండి చాలామంది పాస్టర్లు అమెరికాకు పారిపోయారు.చైనా అధికారులు వేలాది హౌస్‌చర్చ్‌లను మూసివేయించటంతో పాటు చర్చిలపై దాడులు చేస్తున్నారు. బైబిళ్ళను స్వాధీనం చేసుకుంటు, క్రైస్తవం ఆచరిస్తే కచ్చితంగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని ఆంక్ష పెట్టారు.జీసస్ చిత్రపటానికి బదులు జిన్‌పింగ్‌ని ప్రార్థించమని ఒక చర్చిలో అధికారులు చెప్పారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.అలాగే క్రైస్తవుల ఈ-కామర్స్ సైట్లను అధికారులు మూసివేయించారు.కొంత మంది క్రైస్తవులు రహస్యంగా ప్రార్థనలు నిర్వహిస్తు,భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.

LEAVE A REPLY