15 మంది కేంద్ర అవినితి అధికారుల‌ను ఇంటికి పంపిన కేంద్ర ఆర్ధిక శాఖ‌

అమరావ‌తిః రెండ‌వ సారి అధికారం చేప‌ట్టిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌న‌దైన శైలిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారుల‌ను పాల‌న వ్య‌వ‌స్థ‌లో నుండి బ‌య‌ట‌కు పంపివేశారు.ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం మరో 15 మంది కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులపై కేంద్ర ఆర్థిక శాఖ వేటు వేస్తు తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని ఆదేశించింది.అవినీతి ఆరోపణలు,వృత్తిరీత్యా తప్పుడు ప్రవర్తన కారణంగా ఈ నెల 10వ తేదీన 12 మంది సీనియర్‌ అధికారులను ఇళ్ల‌కు పంపింది.ఇది జ‌రిగి వారం తర్వాత మరో పదిహేను మంది అవినీతి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని ప్రత్యేకాధికారాలతో భారత రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న15 మంది సీనియర్‌ ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు రాష్ట్రపతి ఆదేశించారు’ అని ఆర్థిక శాఖ ట్విటర్‌లో వెల్లడించింది.ఈ 15 మందికి మూడు నెలల వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరిలో చాలామంది కమిషనర్‌ అంతకంటే పైస్థాయి వారే కావడం గమ‌నించ త‌గ్గ ఆంశం.నేడు వేటు పడిన 15 మందిలో 11 మందిపై CBI కేసులు నమోదు కాగా ఇద్దరిపై రెవెన్యూ విభాగం కేసు నమోదు చేసింది.ఈ అధికారులంతా కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు,కస్టమ్స్‌(CBIC) విభాగానికి చెందిన అధికారులే. వేటు పడిన వారిలో దిల్లీలోని CBIC విభాగంలో ప్రిన్సిపల్‌ ADGగా పనిచేస్తున్న ప్రిన్సిపల్ కమిషనర్‌ అనూప్‌ శ్రీవాస్తవ,J.C నళినికుమార్‌ కూడా ఉన్నారు.అనూప్‌ శ్రీవాస్తవపై పలు CBI కేసులు నమోదయ్యాయి.దీంతో పాటు వేధింపులు,దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైజాగ్‌ అధికారిః-వేటు పడిన అధికారుల్లో వైజాగ్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి కూడా ఉన్నారు. వైజాగ్‌ Central GST విభాగానికి చెందిన అదనపు కమిషనర్‌ రాజుశేఖర్‌ను కూడా ఉద్యోగ విరమణ పొందాలని కేంద్ర ఆర్థిక శాఖ అదేశించింది.