సిబిఐలో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు తెలుసుకోవాలనుకుంటున్నారు-జైట్లీ

0
61

అమ‌రావ‌తిః సిబిఐ డైరెక్ట‌ర్‌ అలోక్‌వర్మ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు,,‘సీబీఐ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జీ పర్యవేక్షణలో రెండు వారాల్లో విచారణ జరిపి నివేదికను,,సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీవీసీని ఆదేశించింది.ఈ ఆదేశాలపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తు,,సుప్రీం ఆదేశాన్ని‘అత్యున్నత సానుకూల పరిణామ’మని ఆయన వ్యాఖ్యానించారు.విచారణపై నమ్మకాన్ని కల్పించేందుకు రిటైర్డ్ జడ్జీని సుప్రీంకోర్టు నియమించిందన్నారు.అలోక్‌వర్మ,రాకేష్ అస్థానాను సెలవుపై పంపించిన కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.సీబీఐ సమగ్రత,పనితీరు మసకబారకూడదని ప్రభుత్వం భావిస్తోందని,సీబీఐలోని ఉన్నతాధికారులు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారని తెలిపారు.సీబీఐలోని అధికారులు,ముఖ్యంగా ఉన్నతస్థానంలో ఉన్న ఇద్దరు అధికారులు కళంకితులుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన పరిణామాలు సీబీఐ ప్రతిష్ఠను దిగజార్చాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని,నిజం ఏంటో తెలుసుకోవాలని దేశప్రజలు భావిస్తున్నారని జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలు,రాహుల్ అరెస్ట్‌పై స్పందించిన అయ‌న‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY