రాష్ట్రంలో టిడిపి మ‌ట్టికొట్టుకుని పోతుంది-క‌న్నా

0
121

అమ‌రావ‌తిః చంద్రబాబు అబద్ధాలు చెబుతూ కేంద్రాన్ని, బీజేపీని దోషి చూపించే ప్రయత్నం చేస్తున్నారని,చంద్రబాబు అబద్ధాలను ప్రజలు పసిగట్టిన నాడు ఏపీలో టీడీపీ మట్టికొట్టుకుపోతుందని,నామారూపాల్లేకుండా పోతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి అధ్య‌క్ష‌డు కన్నా.లక్ష్మీనారాయణ దుమ్మేత్తిపోశారు.ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో భేటీ అయిన అనంతరం బీజేపీ నేతలు పురంధేశ్వరి,జీవీఎల్ నర్సింహారావుతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని,దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి కేంద్రం చేసిందని అన్నారు. 30జిల్లాలున్న కర్ణాటకకు రూ.76వేల కోట్ల గ్రాంట్స్ ఇస్తే.. 13జిల్లాలున్న ఏపీకి రూ. లక్షా26వేల కోట్లు కేంద్ర ఇచ్చిందని చెప్పారు. ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు నాయుడుహోదా అంటూ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని తనను ప్రధాన మోడీ అడిగారని కన్నా తెలిపారు. చంద్రబాబుకు అందరికన్నా ప్రాధాన్యత ఇచ్చామని మోడీ చెప్పారని తెలిపారు.కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుంటూనే.. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తూనే ఉందని,ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తిరుపతి సభలో ఇచ్చిన మాటకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు.హోదా విభజన చట్టంలో లేదని, అందుకే ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.16,500 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని,అవినీతి, స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి.. ఎస్పీవీలు ఫాం పూర్తి చేసి రావాలని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు.

LEAVE A REPLY