పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు ఎంత త‌గ్గుతాయి.?

0
163

అమ‌రావ‌తిః మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు చుక్క‌ల‌ను చూపిస్తు,,రోజురోజుకూ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోమంటకు ఉపశమనం దొరికే అవకాశం కనిపిస్తోంది.దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డులను దాటి పరుగులు తీస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు ఉపశమనాన్ని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో కొన్ని చర్యలను చేపట్టే అవకాశం ఉందని సమాచారం.ఇదిలాఉండగా..పెట్రోల్ – డీజిల్ ను వస్తు – సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు క్ర‌మేపి పెరుగుతున్నాయి.ఇదే గనుక జరిగితే జీఎస్టీ శ్లాబులను బట్టి లీటర్ పెట్రోల్ ధర రూ. 38 నుంచి రూ.43 మేరకు – డీజిల్ ధర రూ.31 నుంచి రూ.37 మేరకు తగ్గుతాయి.అయితే ఇంధన ధరల పెరుగుదల కేవలం ఒక రాష్ర్టానికే పరిమితమైన సమస్య కాదని – ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పెట్రోల్ – డీజిల్ ను వస్తు – సేవల పన్ను పరిధిలో చేర్చాల్సిందిగా కోరామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి ప్ర‌జ‌ల్లో నెలకొంది.

LEAVE A REPLY