ఎయిమ్స్‌లో రొటీన్ చెకప్‌ల‌కోసం మాజీ ప్ర‌ధాని వాజ్‌పాయి

0
17

అమ‌రావ‌తిః బీజేపీ సీనియర్ నేత,మాజీ ప్రధాని వాజ్ పేయిని (94 ) సోమ‌వారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రొటీన్ చెకప్,పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారని అక్కడి వైద్యులు తెలిపారు.ఎయిమ్స్ డైరెక్టర్,పల్మనాలజిస్ట్ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పర్యవేక్షణలోవాజ్ పేయికి పరీక్షలు నిర్వహించనున్నారు.దాదాపు మూడు దశాబ్దాల నుండి వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్‌గా రణ్‌దీప్ వ్యవహరిస్తున్నారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఅయ‌న‌ మంచానికే పరిమితమయ్యారు.రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న వాజ్ పేయి 1924లో జన్మించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి వాజ్ పేయి. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఆయనకు లభించింది.వాజ్‌పేయిని అమిత్‌షా,రాహుల్‌గాంధీలు ప‌ర‌మ‌ర్శించి,అయ‌న ఆరోగ్యం గురించి డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY