శౌర్య,పరాక్రమాలకు ప్రతీక భారత్ వాయుసేన-మోదీ

అమరావతి: నేడు భారత వాయుసేన 87వ వార్షికోత్సవం కావడంతో, ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ, భారత వాయుసేనను చూసి జాతి యావత్తూ గర్విస్తోందన్నారు. దేశానికి నిబద్ధత, ప్రతిభతో,పట్టుదల,సవాళ్లతో కూడిన సేవలను వాయుసేన అందిస్తోందని కొనియాడిన ప్రధాని, భారతదేశం తరఫున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి నిబద్ధతతో,పరాక్రమం,ప్రతిభావంతమైన సేవలను కొనసాగించాలని అభిలషిస్తున్నట్టు పేర్కొన్నారు.ఈ సందర్భంలో భారత వాయుసేన సాధించిన విజయాల సమాహారంతో వున్నవీడియోను తన ట్వీటర్ లో పోస్టు చేశారు.