బుఖారీని హత్య చేసింది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే

0
99

అమ‌రావ‌తిః జూన్ 14న సీనియర్‌ పాత్రికేయుడు,రైజింగ్‌ కాశ్మీర్‌ సంపాదకుడు షుజాత్‌ బుఖారీని హత్య చేసింది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ స్వయం ప్రకాశ్‌ తెలిపారు. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు,మరో కాశ్మీరీ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.అంతేగాక, బుఖారీ హత్యకు పాకిస్థాన్‌లోనే కుట్ర పన్నారని, నిందితుల ఫొటోలను గురువారం పోలీసులు విడుదల చేశారు.హత్య జరిగిన ప్రాంతంలో రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వాటి ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి’ అని స్వయం ప్రకాశ్‌ వెల్లడించారు.నిందితుల్లో ఒకర్ని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది నవీద్‌ జాట్‌గా ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్ననవీద్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్‌ ఆసుపత్రిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో తప్పించుకున్నాడు.

LEAVE A REPLY