రెండు గంట‌ల పాటు బాబు ఎక్క‌డా ?

0
175

అమ‌రావ‌తిః ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడునిన్నటి నుంచి తన ఢిల్లీ టూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.మొన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు గానీ తన విడిది నుంచి బయటకు రాలేదు.11 గంటల ప్రాంతంలో పార్లమెంటుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ తన పార్టీ ఎంపీలతో సమావేశమై ఆ తర్వాత నేరుగా పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రత్యక్షమయ్యారు.అక్కడే దాదాపు 2.30 గంటల పాటు గడిపిన చంద్రబాబు పలు జాతీయ పార్టీలు-ప్రాంతీయ పార్టీల ఎంపీలతో ప‌ల‌క‌రింపుల కార్య‌క్ర‌మం తర్వాత తిరిగి విడిది చేరుకున్న చంద్రబాబు పూర్తిగా విశ్రాంతి తీసుకుని రాత్రి తనదైన మార్కు పర్యటనకు శ్రీకారం చుట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి ? రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా విడిది నుంచి బయటపడిన చంద్రబాబు ఓ రెండు గంటల పాటు అడ్రెస్ లేకుండా పోయారట? ఈ విషయంపై మంగ‌ళ‌వారం రాత్రే గుస గుస‌లు విన్పించిన‌, అదేమీ లేదన్నట్లుగా టీడీపీ వర్గాలు వ్యవహరించిన వైనం కూడా పలు మీడియాల్లో ఆసక్తికర కథనాలుగానే వచ్చేసింది. అయినా ఆ రెండు గంటల పాటు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారన్న విషయానికి వస్తే బీజేపీతో టీడీపీ కటీఫ్ చెప్పేయడంతో పాటుగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు – ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ అవినీతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోట్ల కొద్ది నల్లడబ్బును దాచేసిన తమిళనాడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి అవినీతిలో నారా లోకేశ్ కు కూడా పాత్ర ఉందని చెప్పిన పవన్ ఈ విషయం తెలిసిన కారణంగానే చంద్రబాబును మోదీ దూరం పెట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా చంద్రబాబుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై ఎక్కడ కేసులు పెడతారోనన్న భయం బాబును నిలువనీయడం లేదట. ఈ కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా పేరు చెప్పి ఢిల్లీలో ల్యాండైన చంద్రబాబు నిన్న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రముఖ న్యాయవాదితో గుట్టుగా భేటీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన అవినీతిపై మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం అంటూ మొదలెడితే ఆ కేసులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలనే విషయంపై చర్చించేందుకే సదరు లాయర్‌ను అయ‌న కలిసినట్లుగా ఢిల్లీ వర్గాల భోగట్టా ? తనలో గూడుకట్టుకున్న భయాన్ని పోగొట్టుకోవడంతో పాటుగా తనను తాను రక్షించుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు స‌ద‌రు లాయర్‌ను కలిసినట్లుగానూ వార్తలు వినిపిస్తున్నాయి ? మొత్తానికి ప్రత్యేక హోదా పేరు చెప్పి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.ఎవరికీ చెప్పకుండా ఓ రెండు గంటల పాటు అదృశ్యమైన విషయం ఇప్పుడు నిజంగానే ఆసక్తికర చర్చకు తెర తీసిందనే చెప్పాలి.

LEAVE A REPLY