రావ‌ణ ద‌హ‌న కాండం ఘ‌ట్టంలో ఘోరా ప్ర‌మాదం-50 మంది మృతి

0
369

అమ‌రావ‌తిః పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ దసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో కనీసం 50 పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.శుక్ర‌వారం సాయంత్రం చౌరా బజార్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.రైల్వే ట్రాక్‌ పక్కన రావణ దహనం సంద‌ర్బంలో ప‌ఠాస‌లు కాలుస్తున్న స‌మ‌యంలో ద‌హ‌న కాండ‌ను పట్టాలపై నిలుచుకుని వీక్షిస్తున్నవారికి రైలు శ‌బ్దం విన‌ప‌డ‌లేదు.దింతో హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింద‌ని ప్రత్యక్ష సాక్షి న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో దాదాపు 700 మంది ప్ర‌జ‌లు ఉన్న‌ర‌ని,ఇందులో 50 మందిపైగా మృతి చెందారని పోలీసులు తెలిపారు.సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించామని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.పంజాబ్ మంత్రి,మాజీ క్రికెటర్ సిద్దు సంఘటన స్థలంలో ఉండి కూడా పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

LEAVE A REPLY