మ‌హిళ‌ హోంగార్డులపై పోలీసు బాస్‌ల లైగింక వేధింపులు-విష‌యం సిఎం దృష్టికి

0
85

అమ‌రావ‌తిః ప్ర‌తి రోజు ప‌త్రి గంట దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర మ‌హిళ‌లు లైగింక వేధింపుల‌కు గురుఅవుతున్నారు.ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌పై ద‌ర్య‌ప్తు చేసే పోలీసు అధికారులే లైగింక వేధింపుల‌కు పాల్ప‌ప‌డితే మ‌హిళ‌లు ఏవ‌రికి చెప్పుకోవాలి ? ఆస‌లు విష‌యంలోకి వ‌స్తే,,,గుజరాత్ పోలీస్ శాఖలో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది.నచ్చిన చోటుకు బదిలీ కావాలంటే తమ కోరిక తీర్చాలని సీనియర్ అధికారులు వేధిస్తున్నారంటూ 25 మంది మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తు,వీరు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మకు ఫిర్యాదు చేశారు.గత కొన్ని రోజులుగా ఈ లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందని వాపోయారు.ఈ మేరకు కమిషనర్ సతీశ్ కు నాలుగు పేజీల లేఖను అందజేశారు.ట్రాన్స్ ఫర్ కావాలంటే కోరిక తీర్చాలనీ, లేదంటే భారీగా నగదు ముట్టజెప్పాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మరో సీనియర్ అధికారి అయితే ‘యూనిఫాం సరిచేసుకో’ అంటూ తాకరాని చోట తాకారని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.దీంతో ఈ విషయాన్ని విచారించాల్సిందిగా డీసీపీ పంపేమ‌ని,ఈ ఘటనపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతోందని కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు.ఈ ఫిర్యాదు కాపీని ముఖ్యమంత్రి విజ‌య‌రూపానీతో పాటు హోంమంత్రి ప్ర‌దీప్‌సిన్హ జ‌డేజా కూడా పంపేమ‌ని,విచారణలో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

LEAVE A REPLY