2 వేల‌కే మైక్రోమ్యాక్స్ 4 జి ఫోన్‌-జియోకు త‌గిన పోటీ.?

0
177

అమ‌రావ‌తిః రిల‌య‌న్స్ జియోను ధీటుగా ఎదుర్కొంనేందుకు మొబైల్ ఫోన్ కంపెనీల‌తో పాటు,సెల్ ఆప‌రేటర్లు త‌మ‌దైన ప‌ద్ద‌తి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు,ఈ నేప‌థ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ రూ.2 వేలకే 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారత్ వన్ 4జీ పేరిట విడుదల కానున్నాయి.తమ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ కూడా ఉచితంగా అందుకోవచ్చని మైక్రోమ్యాక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఈ ఫోన్ ఫీచ‌ర్ల గురించి స‌మాచారం అందాల్సి ఉంది. రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్లకు మైక్రోమ్యాక్స్ ఫోన్ పోటీ ఇస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మైక్రోమ్యాక్స్‌కి బీఎస్ఎన్ఎల్ కూడా తోడు కావ‌డంతో మైక్రోమ్యాక్స్ భారత్ వన్ 4జీకు మంచి డిమాండ్ రావ‌చ్చ‌ని  బి.ఎస్‌.ఎన్‌.ఎల్ ఛైర్మ‌న్ ఆనుపమ్‌ సిన్హా అన్నారు.

LEAVE A REPLY