తూత్తకుడి పోలీసుల కాల్పుల్లో 11 మంది మృతి-ప‌రిస్దితి ఉద్రిక‌త్తం

0
36

అమ‌రావ‌తిః త‌మిళనాడు రాష్ట్రంలోని తూత్తకుడి మంగ‌ళ‌వారం రణరంగంగా మారింది. అక్కడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్నివిస్తరించాలని జరుగుతున్న యత్నాలను నిరసిస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి.పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ను ముట్టడించేందుకు నిరసనకారులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. ఈక్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు..పలు వాహనాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించిన అనంతరం లాఠీఛార్జి చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11మంది మృతి చెందారు.ఈ సంఘటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ సంఘ‌ట‌న‌పై మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. కాగా, 1996లో స్టెరిలైజ్ పరిశ్రమను ఇక్కడ ప్రారంభించారు. గ‌త 20 సంవ‌త్స‌రాల నుండి తరచుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. స్టెరిలైజ్ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని తూత్తకుడి వాసులు వాపోతున్నారు.2013లో కంపెనీ వ‌ద్ద గ్యాస్ లీక్ కావ‌డంతో అప్ప‌టి త‌మిళనాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత దినిపై స్పందించారు.ఈకేసు గ్రీన్ ట్రిబ్యూల్ వుంది,దినిపై జూన్ 6వ తేది విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.విష‌యం తెలుసుకున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి మృతుల‌కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల రూపాయల ఎక్స్‌గ్రెషియా,గాయ‌పడిన వారికి 3 ల‌క్ష‌ల వంతున ప‌రిహ‌రం,సంఘ‌ట‌న‌పై మెజీస్ర్టిరీయ‌ల్ విచార‌ణ‌కు అదేశిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రేపు తూత్తకుడి జిల్లా బంద్ః-ఈ సంఘటన నేపథ్యంలో రేపు తూత్తకుడి జిల్లా బంద్‌కు వాణిజ్య సంస్థలు పిలుపు నిచ్చాయి. ఆందోళనకారులపై పోలీసుల దాడిని ఖండించిన వాణిజ్య సంస్థలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి.

LEAVE A REPLY