హెచ్‌సిఏ అధ్య‌క్ష ప‌ద‌వీకి ఆజ‌హ‌ర్ నామినేష‌న్‌

0
377

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అజర్ నామినేషన్ దాఖలు చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటూ, దాదాపు 16 సంవత్సరాలుగా ఆటకు, మైదానానికీ దూరమైన మహమ్మద్ అజారుద్దీన్ ప్రత్యక్ష క్రికెట్ కార్యకలాపాల్లోకి తిరిగి వచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌ సీఏను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికే తాను వచ్చానని,అవినితి ఆరోప‌ణ‌ల్లో కూర‌కుని,ఒక‌నొక స‌మ‌యంలో క్రికెట్ పోటీల‌కు అతిథ్యం ఇవ్వ‌లేని ద‌యానీయ‌మైన స్థితికి హెచ్‌సిఏ వ‌చ్చింద‌న్నారు.జ‌రిగి పోయిన దాని గురించి త‌ను ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని,ఇక‌పై హెచ్‌సిఏ పూర్వ‌వైభ‌వం ఎలా తీసుకుని రావ‌లనే విష‌యంపై గురించి ఆలోచిస్తాన్నారు.మొరాద‌బాద్ ఎంపిగా గెలిచిన త‌రువాత హైద‌రాబాద్‌కు అప్ప‌డ‌ప్ప‌డు వ‌చ్చి వెళ్లుతున్న ఆజ‌హ‌ర్ తన జీవితాంతం క్రికెట్ కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ఏ క్ల‌బ్ నుంచి అజర్ నామినేష‌న్ దాఖ‌లు చేశాడ‌న్న విష‌యం తెలియరాలేదు. అజ‌ర్ ఎంట్రీతో ఈ ఎన్నిక‌లు హాట్ హాట్ గా సాగుతాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై, తన వందో టెస్టుకు ముందు అజర్ తన కెరీర్ ను ముగించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY