శ్రీవారి క‌ళ్యాణం

0
482

Times Of Nellore ( Mumbai ) – విమానాల్లో ఆకతాయిల ఆటలు మరింత శృతిమించుతున్నాయి. విమానంలో ఓ మహిళపై ఓ ఎన్నారై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడని వార్తలు వచ్చి కొద్దిరోజులు కూడా కాకముందే మరో భారతీయుడు కూడా అలాంటి దుశ్చర్యకే దిగాడు. ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్‌కు బుధవారం వెళుతున్న ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది. గనేష్ పార్కర్ అనే 40 ఏళ్ల వ్యక్తి బిజినెస్ క్లాసు టికెట్‌తో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఎకానమీ క్లాస్‌లో ఉన్న ఓ మహిళ పక్కన సీటు ఉండటం గమనించాడతను. అంతే అతడి బుద్ధి వక్రమార్గం పట్టింది. రాత్రిపూట అతడి సీటు వదిలేసి నిద్రపోతున్న ఆమె పక్కన వచ్చి పడుకున్నాడు. ఆమె దుప్పటిలోకి చేయిని పోనించి నీచ కృత్యానికి పాల్పడ్డాడు. మగత నిద్రలో ఉన్న ఆమెకు విషయం తెలిసివచ్చి గట్టిగా కేకలు వేసింది. దీంతో పరిస్థితిని గమనించి పార్కర్‌ను విమాన సిబ్బంది అతడి సీటు వద్దకు పంపించారు. ఆ తర్వాత తాను ఆమెతో మాట్లాడాలి అని విమాన సిబ్బందిని కోరాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో నేను ఓ తప్పుడు పని చేశాను. నేనో మూర్ఖుడిని. నన్ను క్షమించండి అంటూ ఓ రెండు లేఖలు రాసి సిబ్బంది ద్వారా ఆమెకు ఇప్పించాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ పోర్ట్ పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. నెవార్క్ ఫెడరల్ కోర్టులో గురువారం మధ్యాహ్నం ఈ కేసు విషయమై విచారణ జరిగింది. మొత్తానికి అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు 2 లక్షల 50 వేల డాలర్ల జరిమానాను విధించారు. పూచికత్తుమీద బెయిల్ మీద విడుదలయినా కొన్నాళ్ల పాటు అతడిని ఇంటి నుంచి బయటకు రానీయకుండా ఉంచాలని కోర్టు ఆదేశించింది.

LEAVE A REPLY