ప‌ట్టాలు త‌ప్పిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 32 మంది మృతి హెల్ప్‌లైన్

0
371
 8106053006(ఎయిర్‌టెల్‌),,,8500358712(బీఎస్ఎన్ఎల్‌)

విజ‌య‌న‌గ‌రంః విజ‌య‌న‌గ‌రం కొమ‌రాడ వ‌ద్ద శ‌నివారం 11.30 గంట‌ల స‌మ‌యంలో ప‌ట్టాలు త‌ప్పింది.100 మందికి పైగా తీవ్ర‌గాయాలు అయ్యాయి.8 బోగిలు బోల్తా ప‌డ‌గా,ఒక ఏసి బోగితో స‌హ నుజ్జు,నుజ్జు అయింది.శ‌నివారం ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని జ‌గ‌ద‌ల్‌పూర్ నుండి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ వెళ్లున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమ‌రాడ మండ‌లం క‌నేరు స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పింది.దింతో ఇంజ‌న్‌తో స‌హ నాలుగు బోగిలు ప్ర‌క్క‌న ట్రాక్‌పై వెళ్లుతున్న గూడ్స్‌రైలు ఢీ కొన్న‌యి.ఈ ప్ర‌మాదంలో ఫ్రాథ‌మికంగా అందిన స‌మాచారం ప్ర‌కారం 32 మంది వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తుంది.స‌మాచారం అందిన వెంట‌నే హోంమంత్రి చిన్న‌రాజ‌ప్ప త‌క్ష‌ణ స‌హ‌యం అందించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.దింతొ విజ‌య‌న‌గ‌రం,విశాఖ‌ప‌ట్నం నుండి రైల్వే స‌హ‌య‌క బృందాలు హుట హుటిన సంఘ‌ట‌న స్థ‌లంకు ఆర్ధ‌రాత్రి 2.30 గంట‌ల స‌మ‌యానికి 25 మృతుదేహాల‌ను వెలికి తీసునట్లు స‌మాచారం.ఎస్ 6,ఎస్ 7 తోపాటు ఒక ఏసి బోగి,8 జ‌న‌ర‌ల్ బోగిలు బోల్తా ప‌డ్డాయ‌ని స‌మాచారం.వాల్తేరు డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్ చంద్ర‌లేఖముఖ‌ర్జీ విశాఖ నుండి సంఘ‌ట‌న స్థ‌లంకు చేరుకుని స‌హ‌య ప‌నుల‌ను పరివేక్ష్యిస్తున్నారు.గాయ‌ప‌డిన వారిలో దాదాపు 70 మంది క్ష‌త‌గాత్రుల‌ను పార్వ‌తీపురం,రాయ్‌గఢ్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అంద‌చేస్తున్నారు.రైల్వే అధికారులు భాధితుల గురించి వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ 8106053006(ఎయిర్‌టెల్‌),,,8500358712(బీఎస్ఎన్ఎల్‌) నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY