ఘర్షణల ప్రభావం రోహింగ్యా ముస్లింలు నివసించే గ్రామాలపై లేదు- అంగ్‌శాన్ సూకీ

0
118

అమ‌రావ‌తిః మత ఘర్షణల కారణంగా మయన్మార్‌ విడిపోవడాన్ని తాము ఎంతమాత్రం సహించమ‌ని, ఘర్షణల ప్రభావం రోహింగ్యా ముస్లింలు నివసించే గ్రామాలపై ఎంతమాత్రం పడలేదని, వారికి పౌరసౌత్వం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామ‌ని మయన్మార్‌ నేత అంగ్‌శాన్ సూకీ తెలిపారు. నైపిడాలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మయన్మార్‌లో జరిగిన ఘర్షణల కారణంగా ఆగస్టు 25 నుంచి దాదాపు 4.10లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. దీంతో ఆ దేశం రోహింగ్యాలను రానివ్వడానికి అభ్యంతరం చెబుతోంది.ఇక్కడి పరిస్థితులను కావాలంటే ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చి పరిశీలించవ‌చ్చాన్నారు.మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి చెందిన ప్రజలే ఈ రోహింగ్యాలు. వీరికి ఏ దేశపు పౌరసత్వం లేదు. దీంతో వీరిని శరణార్థులుగా పరిగణిస్తున్నారు. మయన్మార్‌ నుంచి వీరిని తరిమేసేందుకు సైన్యం దాడులు చేయడంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో వివాదాస్పదమైంది.అంత‌కు ముందు అర్క్‌న్‌ రోహింగ్యా సాల్వేష‌న్ ఆర్మీ (Arsa) పేరుతో సంస్ద న‌డుస్తుంది.ఆగ‌ష్టులో ఈ సంక్షోభం ముదిరింది.

LEAVE A REPLY