500ల‌తో ముంబైకి వ‌చ్చా-దిశా ప‌టానీ సినిమా క‌ష్టాలు

0
105

అమ‌రావ‌తిః సినిమా పరిశ్రమలో స్థిరపడాలంటే సినిమా క‌ష్టలు అనుభ‌వించి వారు చెపితే కాని తెలియదు.అలాంటి కోవలోకి దిశా ప‌టానీ ఒక‌రు. సిని ప‌రిశ్ర‌మ‌లో పెద్ద త‌ల‌కాల‌య అండ లేకుండా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టమంటమ‌ని అంద‌రికి తెలుసు. బిగ్‌బాస్‌ల స‌పోర్ట్ లేకుండా సిని ప‌రిశ్ర‌మ‌లో నిలదొక్కుకున్న వారిలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఒకరు.ఆమె నటించిన భాగీ2 చిత్రం విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకొన్నది.ఈ నేపథ్యంలో దిశాపటానీ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరించింది. ఓ దశలో ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవని ఆమె వెల్లడించింది.కాలేజీలో చదువుతుండగానే స్టడీస్‌ను వదిలేసి ముంబైకి వచ్చాను. ఎవరు తెలియకుండా ఓ కొత్త ప్రదేశానికి రావడం ఓ యువతికి కత్తి మీద సామే.ఒంటరిగా ఉండేదానిని.స్వయంగా డబ్బు సంపాదించుకొనేదానిని.నా కుటుంబంపై ఎన్నడూ ఆధారపడలేదు.కేవలం రూ.500తో నేను ముంబైకి వచ్చాను. కొన్నాళ్ల తర్వాత నా వద్ద ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి.దాంతో కష్టాలు ప్రారంభమయ్యాయి.ప్రతీ రోజు ఏదో ఒక ఆడిషన్‌కు వెళ్లేదానిని.టీవీ యాడ్స్‌లో నటించేదానిని. దాంతో రోజు పూటగడిచేది.ఓ దశలో ఇంటి అద్దె కట్టుకోవడానికి కష్టమయ్యేది.చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను.ఏ దశలోనే మనోధైర్యాన్ని కోల్పోలేదు.ఏదో ఒకరోజు మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూసేదానిని.భాగీ2 చిత్రంలో అవకాశం వచ్చినపుడు చాలా సంతోషపడ్డాను. భాగీ పార్ట్1 చిత్రంలో నేను నటించలేదు కాబట్టి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. టైగర్ సహకారం అందించడంతో నాకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY