అనుష్క‌-వ్యాపార‌వేత్త నిమ్మ‌గ‌డ్డ.ప్ర‌సాద్‌ల పెళ్లి ???

0
1409

ఏమో గుర్రం ఆకాశంలోకి ఏగురుతుందా..!
ఫిల్మిమ్‌న‌గ‌ర్ః సినిమా ప్ర‌పంచంలో ఏ హిరోయిన్ ఎవ‌రిని పెళ్లి చేసుకుంటుదో లేదా ఎవ‌రితో స‌హ‌జీవ‌నం చేస్తుందో అనేది త‌ల పండిన సిని విమ‌ర్శ‌కులు సైతం చెప్ప‌లేని ప‌రిస్దితి,,అలాంటి హిరోయిన్‌గా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో వెలుగొందుతున్న అనుష్క‌శెట్టి పెళ్లి ఇప్ప‌డు ఫిల్మిమ్ న‌గ‌ర్‌లో హ‌ట్ టాపిక్ అయింది.తెలుగుతెరపై జేజెమ్మగా వెలిగిపోతున్న నటి అనుష్కకు ఇప్పుడు 36 ఏళ్ల వయస్సు. 2005లో సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క కెరీర్,, అరుంధతి సినిమాతో వెనుదిరిగి చూసుకోవలసిన ఆవసరం లేకుండా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోయింది. తన పన్నెండేళ్ల సినీ జీవిత వైభవానికి పరాకాష్టగా బాహుబలి-2 సినిమాతో అందానికి, అభినయానికి ఉన్న నిర్వచనాన్ని అనుష్క తీసుకెళ్లెంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో అనుష్క-ప్రభాస్‌ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ మరెవ్వరికీ సాధ్యం కాదని ప్రేక్షకులు ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆమె పెళ్లిపై ఇటీవల చాలా పుకార్లు చెలరేగుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతోందని కొందరు అంటే, కాదు అమ్మా నాన్నా ఎంపిక చేసిన అబ్బాయినే చేసుకుంటుందని కొందరంటున్నారు. అయితే తాజాగా అనుష్క పెళ్లిపై వస్తున్న వార్త ఫిలింనగర్‌లో చర్చలకు తెరలేపింది.
టాలీవుడ్‌లో నాగార్జునతో అనుష్కకు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో నాగచైతన్యకి, అఖిల్‌కి యోగ నేర్పించింది అనుష్క. నాగార్జున ఇటీవల నటించిన సినిమాల్లో ఏదో ఒక పాత్రలో స్వీటీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిలేషనే అనుష్క పెళ్లికి బాటలు పరిచిందన్న వార్తలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. నాగార్జునకు బాగా సన్నిహితుడైన వ్యాపారవేత్తను(నిమ్మ‌గ‌డ్డ‌.ప్ర‌సాద్‌) అనుష్క పెళ్లి చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనుష్క ,,ఆ వ్యాపార వేత్త(నిమ్మ‌గ‌డ్డ‌.ప్ర‌సాద్‌) గురించి బాగా తెలిసిన నాగార్జునే ఈ పెళ్లిని సెట్ చేశాడనే వార్త కూడా బలంగా వినిపిస్తోంది. అయితే అనుష్క పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లలో ఒకటిగా ఈ పుకారు కూడా నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది. ఎవరో ఒకరు స్పందిస్తే కానీ ఈ విషయం నిర్ధారణ కాదు..

LEAVE A REPLY