పోలీసు బైక్‌పై తుర్రుమ‌న్న‌ మందుబాబు

0
308

క‌ర్ణాట‌కః మందు ఎక్కువైతే మందుబాబులు చేసే తింగ‌ర ప‌నులు జ‌నాల‌కు న‌వ్వు తెప్పిస్తుంటాయి.ఈ నేప‌థ్యంలో కర్ణాటకలోని హస్సన్‌ జిల్లాలో ఓ సంఘటన చోటుచేసుకుందీ. హస్సన్‌కి చెందిన ఓ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ తన బైక్‌ను రోడ్డు పక్కకు ఆపి పనిమీద పక్కకు వెళ్లాడు. అదే సమయంలో బెల్లూరుకి చెందిన నరేంద్ర అనే వ్యక్తి తాగిన మత్తులో బైక్‌ ఎక్కి టోపీ పెట్టుకుని దాన్నిపై రయ్‌ మంటూ వెళ్లిపోయాడు. రోడ్డుపై వాహనాన్ని ఫోజులు కొడుతూ నడిపాడు. కొంతమంది అతన్ని వీడియో తీస్తుండగా ఈ బైక్‌ను పోలీసు నుంచి కొట్టేశానంటూ కేకలు కూడా వేశాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసు వేరే బైక్‌పై అతన్ని వెంబడించాడు. దాదాపు రెండు కిమీలు ప్రయాణించి నరేంద్రను పట్టుకున్నారు. నరేంద్ర బైక్‌ను ఎత్తుకెళ్లినప్పుడు తాను ఇతర వాహనాల లైసెన్సులు తనిఖీ చేస్తున్నానని దాంతో అతన్ని గమనించలేదని, అతన్ని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY