పాతనోట్ల మార్పిడికి విధించిన గడువు ఎందుకు తగ్గించారు?

0
351

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలపై మండిపడిన- సుప్రీంకోర్టు
ఇంద్ర‌ప్ర‌స్థః మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మీరు నిర్ణ‌య‌లు తీసుకుంటే,ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటి,పాత నోట్లు మార్చుకునేందుకు ప్ర‌క‌టించిన గ‌డ‌వు ఎందుకు మర్చుకున్నారో తెలిపాలంటు సుప్రీమ్ కోర్టు కేంద్రంప్ర‌భుత్వంను,ఆర్బీఐను వివ‌ర‌ణ ఇవ్వ‌ల‌ని ఆదేశిచింది.న‌వంబర్ 9 అర్థరాత్రి నుంచి మార్చి 31 వరకు రద్దయిన పాతనోట్లను ఆర్బీఐ శాఖల్లో మార్చుకునేందుకు తొలుత కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ డిసెంబర్ 31 తర్వాత పాత నోట్లు కల్గి ఉన్నవారు వివిధ ధృవపత్రాలతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్బీఐ శాఖల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ‘పాతనోట్లు తీసుకొనబడవు’ అంటూ బోర్డులు పెట్టాయి దీంతో వివిధ సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్, డీవై చంద్రచుద్, కెఎస్ కౌల్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది.డిసెంబర్ 31 తర్వాత ఆర్బీఐ శాఖల్లో ఎక్కడ పాతనోట్ల మార్పిడి స్వీకరించడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.సుప్రీమ్ కోర్టు వివ‌ర‌ణ‌తో పాత నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ కొంత గ‌డ‌వు ఇస్తుంది ఏమో వేచి చూద్దాం ?

LEAVE A REPLY