మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?

0
220
ఈ చిట్కాలు పాటిస్తే మొటిమ‌లు మాయం..

యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి.వీటివల్ల ముఖం అందవికారంగ అవుతుంది.దిని వ‌ల్ల‌ నలుగురితో కలవాలంటే సంకొచించే పరిస్ధితి ఏర్పడుతుంది.అయితే అలాంటి వారు ఈ 11 చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరిచేరవు.1.మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకొవాలి.మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో ముఖంను క‌డిగి పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.2.మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.3.మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే ఉపశమనం లభిస్తుంది.4.కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది.5.మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి.6.నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటీమలు రాకుండా చూసుకోవచ్చు.7.మొటిమలు ఉన్నయి కదా అని ఏ క్రీమ్ ప‌డితే ఆ క్రీమ్‌ రాసేయకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.8.టమోటాపండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.9.కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.10.మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తెనె,చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లైచేస్తే మొటిమలు తగ్గుతాయి.11.మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు.

LEAVE A REPLY