చుండ్రు అంటే స్కాల్ప్ పై పొడిగా, జిగురుగా ఏర్పడే పొర. దీనికి కారణాలు బ్యాక్టీరియా, ఫంగస్ వీటి వల్ల స్కాల్ప్ పై పేరుకుపోయి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య నుంచీ బయటపడాలనుకుంటే చాలా రకాలైన సహజసిధ్ధగృహ చిట్కాలు ఉన్నాయి. వాటి వల్ల చుండ్రును ఏవిధమైన ఇబ్బంది లేకుండా తొలగించుకోవచ్చు.

చుండ్రు గురించి
సాధారణంగా చుండ్రు స్కాల్ప్ పై వచ్చి ఓ సమస్య. ఇది అందరినీ వారి వారి జీవితాల్లో ఒక్కసారైనా ఇబ్బంది పెడుతుంది. నిజమేంటంటే ఇది ఒక తల పై భాగానికి వచ్చే రుగ్మత. దీని అస్సలు శాస్త్రీయ నామం సెబోహైక్ డెర్మటైటిస్. ఇది సాధారణంగా పొడి బారిన, ఆయిల్ చర్మం అదీ దురదతో కూడిన చర్మం తలపై వస్తుంది. ఇది దురద అలాగే మంట వచ్చేలా చేస్తుంది. ఈ చుండ్రు మీ పరువు మర్యాదలనే తీయటం కాక మీ ముఖం పై మొటిమలను వచ్చేలా చేస్తుంది.

చుండ్రు రకాలు
మొదటిగా చుండ్రు రావటానికి కారణం తలపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇంఫెక్షన్ రావటం వల్ల మొదలవుతుంది. దీనినే మలస్సేజియా అని అంటారు. తత్ఫలితంగా దురదా, మంట, జుట్టు రాలంటం మొదలవుతాయి. దీనికి గల కారణాలు ఒకటి తల చర్మం పొడిబారటం రెండవది వ్యాధులు . మొదటి కారణమైన పొడిబారటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ కారణమైన వ్యాధులు ఇవి ఎలా వస్తాయంటే తలపై సరి అయిన సం రక్షణ తీసుకోకపోవటం, తలస్నానం చేయకపోవటం, తలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవటం, సరియైన ఆహారం తీసుకోకపోవటం.
చుండ్రు రావటానికి గల కారణాలు
ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి కారణం మన శరీరంలో ఉన్న సెబాసియస్ గ్లాండ్ ఎక్కువగా విడుదల అవ్వటం వల్ల ఈ జిడ్డుతనం వస్తుంది. అలాగే వాతావరణంలోని దుమ్ము ధూలీ అలాగే తలపై ఏర్పడే పొర వల్ల ఈ చుండ్రు ఏర్పడుతుంది.
చుండ్రును త్వరగా తొలగించుకునేందుకు కొన్ని గృహ చిట్కాలుః

బంతి, కొబ్బరి నూనె
ముందుగా కొన్ని 50 గ్రాములు బంతి ఆకుల్ని తీసుకుని వాటికి 250 మి.ల్లీ కొబ్బరి నూనె కలిపి స్టవ్ పై ఉడికించాలి. దీనిలో 2 చిటికెడుల కర్పూరం వేయాలి. అలా 15 నిముషాల పాటు ఉడికించాక ఒక బౌల్ లో దానిని తీసుకోవాలి. ఇక రోజూ ఈ ఆయిల్ ను రాసుకోవాలి. కర్పూరం లో అవ్షధ గుణాలు ఫంగల్ కు వ్యతిరేకంగా పని చేసి ఇంఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

మెంతులు
మెంతులు చుండ్రును తొలగిస్తాయి. 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకుని రాత్రి అంతా నానపెట్టి పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకుని వాటికి 2 టేబుల్ స్పూన్స్ ఆపిల్ సైడర్ ను వెనిగర్ ను కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. ఆపిల్ సైడర్ లేకపోతే మీరు నిమ్మ రసాన్ని వేసుకోవచ్చు.

తల దురదకు నిమ్మ
సాధారణంగా నిమ్మకాయ ఓ మంచి దివ్య అవ్షధం. అంతేకాక యాంటీ సెప్టిక్ కూడా. కాబట్టి తలపై చుండ్రు ఎక్కువగా ఉండి దురద మిమ్మల్ని బాధిస్తే 3 టేబుల్ స్పూన్స్ నిమ్మ రసాన్ని తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టిని కలిపి స్కాల్ప్కు పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి పెట్టుకోవటం ఎంతో మంచిది.

తల దురదకు అలోవేరా
మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి అలోవేరా బాగా పనిచేస్తుంది. అలోవేరా ప్రతీ ఇంట్లో ఉండే మొక్కే. కాబట్టి అలోవేరా ఆకుల్ని తీసుకుని దాని మధ్యలో ఉండే జెల్ ను తీసుకుని దానిని స్కాల్ప్ కి రాసుకోవాలి. తర్వాత కొంతసేపు ఆగాక వాష్ చేసుకోవాలి.
.అల్లం
అల్లం తో నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుంటే అది చుండ్రును నివారిచగలదు. ఇది వెంట్రుకల పెరుగదలకు అలాగే ఊడతాన్ని, చుండ్రును తగ్గిస్తుంది. ఆయిల్ ను తలకు పట్టించి మస్సాజ్ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

చుండ్రు నివారణకు హెన్నా
హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్న తీసుకుని దానిలో కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

తులసి ఆకులు
తులసి ఆకు అన్ని విధాల శ్రేష్టమైనది. అందుకే ప్రతీ ఇంటా భక్తి పరంగా కావచ్చు. ఓ మంచి ఔషధం గా కావచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియా అలాగే యాంటీ ఫంగల్ తత్వాలు ఉన్నాయి. తులసి ఆకులకు ఒక టేబుల్ స్పూన్ ఆంల ఆకుల్ని తీసికుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

పెరుగు
పెరుగు చాలా మంచిది. దీనిలో మిరియాల పొడిని కలిపి తలకు పెట్టుకుంటే మంచిగా పనిచేస్తుంది. తలకు పట్టించుకున్న తర్వాత ఒక గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

LEAVE A REPLY