ఆవు పాలు ఆరోగ్య‌నికి ఎంత మేలు ?

0
214

అమ‌రావ‌తిః దేశియంగా గోవు గురించి చ‌ర్చ‌జ‌రుగుతున్న స‌మ‌యంలో,మ‌న పూర్వీకులు చూపిన ప్ర‌కృతితో మ‌మేకం అయ్యే మార్గంను అనుస‌రిస్తే ఖ‌చ్చితంగా ఫ‌లితాలు ఉంటాయి.
దేశీయ గోక్షీరం ఆరోగ్య ప్రదాయిని:
1. కొంచెం, పలుచగా ఉండి త్వరగా అరుగుతుంది.
2. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం.
3.మనిషికి చలాకీని పెంచుతుంది.
4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి. ప్రేగుల లోని క్రిములు నశించును.
5. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
6. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణా తులను చేస్తాయి.
7. మనస్సును, బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
8 ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విటమిను ‘ఎ’ అధికంగా కలిగిన ‘కెసీన్’ అనే ఎంజైమ్ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు
పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
9. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవు పాలు కఫాన్ని హరిస్తాయి.
10. ఆవుపాలు సర్వరోగ నివారణి.
11. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
13.ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని
ఆయుష్షును పెంచుతుంది.
13. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
14. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా
లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు
తుంది. ఆరోగ్యమైన ఎము కలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన
వాక్కు వీటి కోసం ఆవునెయ్యి, వెన్న తప్పక తీసుకోవాలి .
15. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్డిఎల్ కొలెస్టరాల్ను పెంచి చెడుదైన
ఎల్డిఎల్ కొలెస్టిరాల్ను తగ్గించును. హెచ్డిఎల్ కొలెస్టరాల్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.

LEAVE A REPLY