స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వ‌ర్యంలో 10 వేల ఉద్యోగాలు

0
451

అమ‌రావ‌తిః వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రేడ్- బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2017కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. సుమారు 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎస్ఎస్సీ. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు స్టాటిస్టిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ లేదా ఇంటర్‌లో మ్యాథ్‌మెటిక్స్ చదివి ఉండాలి. మిగతా అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇన్ స్పెక్టర్ పోస్టులకు వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 32 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్ విభాగాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

LEAVE A REPLY