నీట్ ఫ‌లితాల వెల్ల‌డికి మ‌రి కొంత స‌మ‌యం??

0
451

నీట్ ఎంట్రెన్స్ ప‌రిక్ష‌ల నాటి నుండి వివాద‌లు…
అమ‌రావ‌తిః ఈనెల 8వ తేదిన ప్ర‌క‌టించాల్సిన నీట్ ఫ‌లితాల వెల్ల‌డి జాప్యం జ‌రిగే సూచ‌న‌లు క‌న్పిస్తున్న‌య‌ని,కొంత మంది అధ్యాపకు వ్యాఖ్య‌నిస్తున్నారు.ఎంబిబిఎస్‌,డెంట‌ల్ కోర్సులో చేరే విద్యార్దుల కోసం దేశ వ్యాప్తంగా ఉమ్మ‌డి ప‌రిక్ష విధానం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ దాదాపు నెల‌ల నుండి ప్ర‌క‌ట‌న చేస్తునేవుంది.2017-18 విద్యాసంవ‌త్ప‌రంలో ఎంబిబిఎస్‌.బిడిఎస్‌లో చేరే విద్యార్దుల‌కు నీట్ ప‌రిక్ష నిర్వ‌హించ‌డం జ‌రిగింది.ఈ ప‌రిక్ష‌కు దేశ‌వ్యాప్తంగా మే 7వ తేదిన‌ దాదాపు 103 ప‌ట్ట‌ణ‌ల్లో 11,38,890 ల‌క్ష‌ల మంది విద్యార్దులు,1.900 సెంట‌ర్స్‌లో హాజ‌రైయారు.ఇందులో 1,522 మంది ఎన్నారైలు,631 మంది విదేశీ విద్యార్దులు వున్నారు. కేవ‌లం 8 నుండి 10 శాతం మంది విద్యార్దులు ప్రాంతీయ బాష‌ల్లో.ప‌రిక్ష‌కు హాజ‌రైయ్యారు.మిగిలిన వారంత ఇంగ్లీష్ మ‌ధ్య‌మంలోనే ప‌రిక్ష రాసేరు. కొద్ది శాతం మంది విద్యార్దుల కోసం ఫ‌లితాలు ఆప‌డం స‌రికాద‌న్న వాద‌న‌లు వున్న‌యి. అయితే రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌లో ఇచ్చిన ప్ర‌శ్న‌ప‌త్ర‌తాలు క‌ఠినంగా వున్న‌య‌ని,ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన ప్ర‌శ్నలు సులువుగా వున్న‌యంటు,ప‌రిక్ష ర‌ద్దు చేసి తిరిగి నిర్వ‌హించ‌లంటు కొంత మంది విద్యార్దులు కోర్టు త‌లుపు త‌ట్టారు.ఇదే స‌మ‌యంలో గుజ‌రాత్ భాష‌లోని ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ అయ్యాయని,ప‌రిక్ష‌లు తిరిగి నిర్వ‌హించ‌ల‌ని,, కొంత మంది విద్యార్ద‌లు గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు. 8 నుండి 10 శాతం రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌లో ప‌రిక్ష‌లు వ్రాసిన విద్యార్దుల‌కు,తిరిగి ప‌రిక్ష‌లు నిర్వ‌హించేందుకు,బోర్డుకు పెద్ద క‌ష్ట‌మేమి కాద‌న్న వాద‌న విన్పిస్తుంది. దింతో ఈనెల 7వ తేదిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌,సిబిఎస్ఇ డైర‌క్ట‌ర్‌ను కౌంట్‌ర్ అఫిడివిట్ దాఖాలు చేయల్సిందిగా మ‌ద్రాసు హైకోర్టు న్యాయ‌మూర్తి ఎం.వి.ముర‌ళిధ‌ర‌న్ ఆదేశించారు.అయితే మ‌ద్రాసు హైకోర్టు వాద‌న‌లు ఈనెల 12 వ తేదిన విన‌నున్న‌ది.మంగ‌ళ‌వారం సిబిఎస్ బోర్డు గుజ‌రాత్ హైకోర్టులో వాద‌న‌లు విన్పించింది.ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ అయ్య‌య‌న‌డం సరికాద‌ని,ఇంగ్లీష్‌,రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌కు సంబంధించి డిఫరెంట్ సెట్స్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్స్‌ను త‌యారు చేయ‌డం జ‌రుగుతుంద్నారు.అయితే ఈ వాద‌న‌ల‌తో నాయ్య‌మూర్తులు ఏక‌భివించ‌లేదు.గుజ‌రాత్ హైకోర్టు న్యాయ‌మూర్తులు చీఫ్ జ‌స్టిస్ ఆర్‌.సుభాష్‌రెడ్డి,జ‌స్టిస్ వి.ఎం పంచోలీలు అవ‌స‌రంమైతే తిరిగి ప‌రిక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించే ఆవ‌కాశం వుందంటున్నారు.ఇదే స‌మయ‌లో గుజ‌రాత్ హైకోర్టులో ఈనెల‌ 13వ తేదిన హియ‌రింగ్ వ‌చ్చే ఆవ‌కాశ‌లు వున్నాయి..ఏది ఏమైన నీట్ ఫ‌లితాల వెల్ల‌డికి మ‌రికొంచం స‌మ‌యం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పిస్తున్న‌య‌ని కొంత మంది ఆధ్యాప‌కులు వ్యాఖ్య‌నిస్తున్నారు..?
(గ‌మ‌నికః అందుబాటులో వున్నఆధ్యాప‌కుల‌ స‌మాచారం మేర‌కు వార్త ఇవ్వ‌డం జ‌రిగింది)

LEAVE A REPLY