భార్య‌పై అనుమానంతో కిరొసిన్ పోసి హ‌త్య ?

0
327

అనంత‌పురంః భార్య‌పై అనుమాపెంచుకున్న భర్త ,భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.ఈసంఘ‌ట‌న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన షేక్షావలి, రేష్మిలు భార్య భర్తలు. వీరికి ముగ్గరు పిల్లలు ఆషిపా(11) షాజియా(9)సాదిక్(4)లు ఉన్నారు.ఇటివ‌ల వ‌ర‌కు వీకి సంసారం ప్ర‌శాతంగానే సాగింది, గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు రేష్మిపై షేక్షావలికి అనుమానం ఏర్పడింది. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి రేష్మిపై కిరోసిన్ పోసి నిప్పింటించాడు. ఇరుపొరుగు వారు రేష్మిని ఆసుప‌త్రికి తీసుకెళ్ళె న‌ప్ప‌టికి, కాలిన గాయాలు తీవ్రంగా వుండ‌డంతో ఆమె మృతి చెందింది. పోలీసులు షేక్షావలిని అదుపులోకి తీసుకుని,కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY