మల్టీప్లెక్స్‌ల థియేటర్లలో తినుబండారాల పేరిట దోపిడి-శ్రీధ‌ర్‌రెడ్డి

0
221

నెల్లూరుః మల్టీప్లెక్స్‌ల థియేటర్లలో తినుబండారాలు,పార్కింగ్ ఫీజుల అధిక రేట్లపై విక్ర‌యించ‌డంపై విజ‌య‌వాడ కంన్జూమ‌ర్ ఫోర‌మ్ తీసుకున్న నిర్ణ‌యంను వైకాపా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వ‌చ్చారు.శుక్ర‌వారం అయ‌న జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌ల‌సి హైకోర్టు,కంన్జూమ‌ర్ కోర్టులు ఇచ్చిన తీర్పు కాపీల‌ను అంద‌చేసి,ప‌ట్ట‌ణంలోని మల్టీప్లెక్స్‌ థియోట‌ర్స్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.అనంత‌రం అయ‌న మీడియాతో మాట్లాడుతూ ఓ కుటుంబం సినిమాకు వస్తే టిక్కెట్లు 600 రూపాయిలు అయితే,ఆహారానికి 1000 రూపాయిలు ఖ‌ర్చుఅవుతుందన్నారు.వాట‌ర్ బాటీళ్లు,ఆహార‌ప‌దార్ద‌లు అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు.మల్టీప్లెక్ల్ ల థియేటర్లలో తినుబండారాల అధిక ధరలపై అధికారులు స్పందించకుంటే సంబంధిత ప్రజా సంఘాలతో క‌ల‌సి న్యాయపోరాటం చేస్తామ‌న్నారు.

LEAVE A REPLY