ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే వురుకునేది లేదు-రోజా

0
146

తిరుప‌తిః చిరంజీవి,పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా తాము విభేదిస్తామని,వ్యక్తిగతంగా వారి కుటుంబాన్నికించపరిచి వారిని భాధించ‌డం మాత్రం సరికాదని,మహిళలపై బాలకృష్ణ మాటలపై సోకాల్డ్ నాయకులు,మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నగిరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు.ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకునంత‌రం మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి నియామకాల విషయంలో చంద్రబాబు హిందువుల మనోభావాలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గతంలో విజయవాడలో హిందూ దేవాలయాలను కూలగొట్టారని,కాళహస్తీ,విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో క్షుద్రపూజలు నిర్వహించారని,ఇప్పుడు టీటీడీలోకి అన్యమతస్తులను తెచ్చి పెడుతున్నారని,తద్వారా హిందువుల అవమానిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వివాదాస్పదం కావడం బాధాకరమన్నారు.హిందువులను గౌరవించడం చంద్రబాబు నేర్చుకోవాలని,తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం సరిగాలేద‌న్నారు.పాలక మండలి పైన వస్తున్నవిమర్శలపై ప్రభుత్వం,చంద్రబాబు వెంటనే వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.కానీ వ్యక్తిగత లాభం కోసం కొందరు చిత్రపరిశ్రమలోని వారి పైననో,లేక పవన్ కళ్యాణ్ పైననో ఇష్టం వచ్చినట్లు దూషణలకు దిగడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న బాలకృష్ణ మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎందుకు నిలదీయడం లేదన్నారు.ఒకరి విషయంలో మాత్రం ఇండస్ట్రీని అభాసుపాలు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార పార్టీలోని బాలకృష్ణను ప్రశ్నించకుండా పవన్‌ను నిలదీయడం ఏమిటన్నారు.చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారని,కొన్ని ఛానల్స్ పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.పవన్,ఆయన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.స్వలాభం కోసం సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని,పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాస్టింగ్ కౌచ్ పైన ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఏదో చెప్పడం సరికాదన్నారు.

LEAVE A REPLY